అమరావతి:4 జనవరి 2021(రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ఈనెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని వేదవిశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు శ్రీత్రిదండి చినజీయర్ స్వామి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసంను దాడులకు పరాకాష్ఠగా చినజీయర్ పేర్కొన్నారు. దాడులు జరిగిన ఆలయాలను సందర్శించి రక్షణ విషయంలో తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యల గురించి స్థానికులతో చర్చిస్తామని తెలిపారు. ఆలయాల పట్ల శ్రద్ధ ఉన్నవారంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని స్వామి పిలుపునిచ్చినట్టు వికాస తరంగణి సంఘటన కార్యదర్శి శ్రీకార్యం భవానీప్రసాద్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







