అమరావతి,1 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్ ప్రతినిధి) :
నైరుతి రుతు పవనాలు నిర్ణీత సమయానికే కేరళలోకి ప్రవేశించాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రా వెల్లడించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల సీజన్‌లో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతం నమోదవుతుందని ఆయన తెలిపారు. దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 75 శాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది. మే 30నే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకటించగా భారత వాతావరణశాఖ మాత్రం విభేదించింది. నైరుతి రుతు పవనాలు ఇవాళే కేరళను తాకినట్టు స్పష్టం చేసింది.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







