గంగవరం (రెడ్ బీ న్యూస్) 17 నవంబర్ 2021: తరగతిలో విద్యా ప్రమాణాల స్థాయిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మండల విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు ఆదేశించారు. స్థానిక ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలో రికార్డులను తనిఖీ చేశారు. తరగతుల వారీగా విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి పరిశీలించారు. ఇంగ్లీష్, లెక్కలు, తెలుగు సబ్జెక్టులలో పలువురు విద్యార్థులు వెనుకబడి ఉండడంతో వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థుల కోసం సమకూర్చిన మధ్యాహ్న భోజనాన్ని ఆయన స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ సక్రమంగా అమలు జరుగుతోందా లేడా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహంలోని స్టోర్ రూమ్, మరుగుదొడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు ఆర్.వి.వి సత్యనారాయణ వసతి గృహ సంక్షేమాధికారి ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







