హిందూపురం (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: పట్టణం: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ బెనిఫిట్ షో వేయకపోవడాన్ని నిరసిస్తూ హిందూపురం పట్టణంలో ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని ఎస్వీ థియేటర్ యాజమాన్యం శుక్రవారం తెల్లవారుజామున ‘పుష్ప’ బెనిఫిట్ షో వేస్తామని టికెట్లు విక్రయించింది. దాంతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకొని టికెట్లు కొనుగోలు చేశారు. అయితే ఎంతసేపటికీ షో ప్రారంభం కాకపోవడంతో వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే షో ప్రారంభించాలంటూ థియేటర్‌లో నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని.. బెనిఫిట్ షో రద్దు చేస్తున్నామని థియేటర్ నిర్వాహకులు ప్రకటించడంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. థియేటర్‌పై రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లాఠీఛార్జీ చేశారు. థియేటర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







