ACB Ride : సామర్లకోట మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ పంజా

UPDATED 12th MAY 2026 2:10 PM

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఈ

​సామర్లకోట, రెడ్ బీ న్యూస్, మే 12 : కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మున్సిపల్ డివిజనల్ ఇంజనీర్ (డీఈ) శశిధర్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే..

​ఒక సివిల్ కాంట్రాక్టర్‌కు సంబంధించిన పెండింగ్ పనులు లేదా బిల్లుల విషయంలో డీఈ శశిధర్ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళిక రచించారు.

​రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు..

​ముందస్తు వ్యూహం ప్రకారం.. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సదరు కాంట్రాక్టర్ నుంచి డీఈ నగదు తీసుకుంటుండగా, మాటు వేసిన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేశారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శశిధర్ చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ రావడంతో, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

​విచారణ వేగవంతం..

​డీఈని అదుపులోకి తీసుకున్న అధికారులు కార్యాలయంలోని పలు రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us