గంగవరం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పిటీసీ సభ్యురాలు బేబీ రత్నం అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కృష్ణా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యల పరిష్కారానికై పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులను కోరారు. అలాగే వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో గల సంక్షేమ పథకాలు అమలు తీరును సభ్యులకు వివరించారు. మండలంలో పలు గ్రామాల్లో రోజూ తాగునీటి సమస్య అధికంగా ఉందని సభ్యులు నిలదీయగా జల జీవన్ మిషన్ ద్వారా త్వరలోనే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని, పనులు టెండర్ల దశలో ఉన్నాయని ఆర్.డబ్ల్యూ.ఎస్ జేఈ అబ్బాయి దొర వివరించారు. రుణాలు లేని గృహ నిర్మాణ లబ్ధిదారులకు త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని ఏఈ చలపతి తెలిపారు. పాఠశాలల్లో అమలు జరిగే జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని పాఠశాల పరిధిలోగల ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సక్రమంగా అమలు జరిగే విధంగా సహకరించాలని ఎంఈవో మల్లేశ్వర రావు కోరారు. తొలుత సూరంపాలెం ఎంపీటీసీ పద్మావతితో మండల ప్రత్యేక అధికారి సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామతులసి, ఎంపీటీసీలు ప్రభాకర్ రావు, పద్మావతి, కనకలక్ష్మి, గంగాదేవి, పలు శాఖల అధికారులు సర్పంచులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







