పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021 : మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి పలువురు వైశ్య ప్రముఖులు శనివారం స్థానిక ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో సంతాపం తెలియచేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రోశయ్య మృతి బాధాకరమని, మంచి పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు ఆయన గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి అన్నారు. అలాగే ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. సమున్నత వ్యక్తిత్వం, విషయపరిజ్ఞానం కలిగి, విలువలు పాటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి రోశయ్య అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంతాపం తెలియచేసినవారిలో లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనుబాబు, మండవిల్లి శ్రీనివాస ముత్యాలు, కొత్త రెడ్డియ్య, గ్రంధి గోపాల్, శ్రీరామ్ ప్రకాష్, తమ్మన శ్రీనివాసరావు, కృష్ణ, బొండాడ పెరుమాళ్ళు, పలువురు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







