అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021 : కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగడంపై కేంద్ర జల వనరులశాఖ మంత్రి షెకావత్ చెప్పింది వాస్తవం కాదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వాయిస్‌ను పార్లమెంట్‌లో వినిపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి ఏం చెప్పిందో షెకావత్ తెలుసుకోవాలని సూచించారు. అన్నమయ్య డ్యాం తెగడంపై న్యాయ విచారణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్నమయ్య డ్యాం తెగడం మానవ తప్పిదం కానేకాదని, అత్యధిక వర్షాలు పడటం వల్లే డ్యాం తెగిందన్నారు. ఏది జరిగినా.. నిజాలు తెలుసుకుని మాట్లాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రికి, రాష్ట్రంలో ప్రతిపక్షానికి ఉంటుందన్నారు. మానవ తప్పిదంగా చిత్రీకరించి ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో అధికారులు పనితీరు ప్రశంసనీయమని కేంద్ర బృందం ప్రసంశించిందన్నారు. వరదలను చంద్రబాబు రాజకీయం చేస్తూ వికృత క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే గృహ వినియోగదారుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చంద్రబాబు అంటున్నారు... అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







