తిరుమల (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : తెలంగాణ గవర్నర్ తమిళ సై తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్ తిరుమలకు చేరుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా ముప్పు తప్పి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించానని... ప్రజలందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని తమిళ సై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలను తెలియ్యజేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







