అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: రాష్ట్రంలో 36 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అదనపు ఎస్పీలుగా పదోన్నతులు పొందిన వారిలో అయిదుగురు అధికారులు సి.జయరామరాజు, ఈ.నాగేంద్రుడు, ఏ.వి.సుబ్బరాజు, కె.శ్రీలక్ష్మీ, జి.స్వరూపారాణి ఇప్పటికే అడహక్ ప్రాతిపదికన అదనపు ఎస్పీలుగా కొనసాగుతున్నారు. తాజాగా వారికి పూర్తి స్థాయి పదోన్నతి లభించింది. వీరందరినీ పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మిగతా 31 మంది డీఎస్పీలు 15 రోజుల్లోగా పదోన్నతి పొందిన హోదాలోని పోస్టుల్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి జి.విజయ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







