హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాలకు రూ.50 కోట్లు చొప్పున.. ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి రూ. 100 కోట్లు విడుదల చేశారు. ఆయా మండలాలకు సంబంధించిన నిధులు సదరు జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ జమ చేసింది. దళితబంధు అమలుపై ఇటీవల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నిధులు విడుదల చేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







