పెద్దాపురం ఎస్ఐపై ఎన్బీడబ్ల్యూ జారీ చేసిన వినియోగదారుల కమీషన్

UPDATED 25 JULY 2026 9:00 PM

పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూలై 25: కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన  పెద్దాపురం SIపై తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల కమీషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడమే కాకుండా, ఆయనను తమ ఎదుట హాజరుపరచాలని కాకినాడ జిల్లా ఎస్పీకి ఉత్తర్వులు జారీ చేసింది. ​వివరాల్లోకి వెళితే.. కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన బైలపూడి హేమసుందర్ అనే వ్యక్తి స్థానిక 'లలితా ఎంటర్‌ప్రైజెస్' డీలర్ వద్ద బ్లూ స్టార్ కంపెనీకి చెందిన ఏసీని కొనుగోలు చేయగా, కొనుగోలు చేసిన పది రోజులకే అందులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనిపై డీలర్, కంపెనీ సరైన రీతిలో స్పందించకపోవడంతో బాధితుడు వినియోగదారుల కమీషన్‌ను ఆశ్రయించగా, విచారణ చేపట్టిన కమీషన్ బాధితుడికి కొత్త ఏసీని అందజేయడంతో పాటు రూ. 15 వేలు జరిమానా, రూ. 4 వేలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని మే నెలలో ఆదేశించింది. ​అయితే కమీషన్ తీర్పునకు కట్టుబడి మొదటి ప్రతివాది అయిన బ్లూ స్టార్ కంపెనీ తన వంతు బాధ్యతను పూర్తి చేసినప్పటికీ, రెండో ప్రతివాది అయిన డీలర్ స్పందించకపోవడంతో కమీషన్ సదరు డీలర్‌పై రెండుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ, అతడిని అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపరచాలని పెద్దాపురం SIని ఆదేశించింది. అయినప్పటికీ 45 రోజుల గడువు ముగిసినా కోర్టు ఆదేశాలను SI(Sub Inspector) పట్టించుకోకపోవడంతో ఈ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన కమీషన్ SI పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఎస్ హెచ్ఓ ని తమ ఎదుట హాజరుపరచాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ని ఆదేశించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us