ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: భారత్‌లో చైనాకు చెందిన మొబైల్ ఫోన్ తయారీ సంస్థలైన షావోమి, ఒప్పోకు పెద్ద షాక్! ఈ రెండు సంస్థలు ఐటీ చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డాయని, అందుకుగాను వాటికి రూ.1000 కోట్లకు పైగా జరిమానా విధించవచ్చని ఐటీ శాఖ తెలిపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై డిసెంబర్ 21న దిల్లీతో పాటు 11 రాష్ట్రాల్లోని ఒప్పో, షావోమి, ఫాక్స్‌కాన్, వన్‌ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల ప్రాంగణాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు చోట్ల సోదాలు జరిపిన అధికారులు పలువురు అధికారుల్ని ప్రశ్నించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ప్రధాన కంపెనీలు రాయల్టీ రూపంలో విదేశాల్లో ఉన్న తమ గ్రూప్ కంపెనీలకు రూ.5500 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేశాయని సోదాల్లో తేలినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ లావాదేవీలకు సంబంధించి ఐటీ చట్టం 1961 కింద సూచించిన ఆదేశాలను ఆ కంపెనీలు ఉల్లంఘించాయని పేర్కొన్నారు. ఇందుకుగాను ఆ రెండు సంస్థలకు రూ.1000 కోట్లకు పైగా జరిమానా విధించాల్సి ఉంటుందని తెలిపారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







