సామర్లకోట: 25 జూలై 2020( రెడ్ బీ న్యూస్):
సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద కౌలు రైతులకు వ్యవసాయ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మండల వ్యవసాయ అధికారి ఐ. సత్య అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌలు హక్కు పత్రం ద్వారా సాగుదారునికి భూమిపై ఎలాంటి హక్కులు లభించవని, కేవలం పంట రుణం, పంట బీమా, సబ్సిడీ పథకాలు,ప్రభుత్వ పరంగా సంబంధిత శాఖ నుంచి అందే సౌలభ్యాలు మాత్రమే సాగు దారు పొందవచ్చన్నారు. పంట సాగు దారు కార్డు కాలపరిమితి కేవలం 11 నెలలు మాత్రమే హనంటుందన్నారు.మళ్లీ కొత్త కార్డు పొందవలసి ఉంటుంది అని తెలియచేశారు. భూయజమానులకు పూర్తిస్థాయిలో నమ్మకం కలగడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు..
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







