రాజమహేంద్రవరం, 1 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): ఓఎన్జీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఆదేష్‌కుమార్ విధులు ఓఎన్జీసీలో నిర్వర్తించనున్నారు. కోనసీమలో సహజ వాయువు లీకేజీలు ఉండకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఓఎన్జీసీ ఈడీ, ఎస్సెట్ మేనేజర్‌గా ఆదేష్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఆయన విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా ఆదేష్‌కుమార్ మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా 8వేల టన్నుల చమురు ఉత్పత్తి తగ్గిందని తెలిపారు. ఉభయగోదావరి, కృష్ణ జిల్లాల నుంచి ప్రస్తుతం రోజుకు 600 టన్నుల ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. కోనసీమలో సహజవాయువు, చమురు లీకేజీలు ఏర్పడకుండా చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పాతపైపులు తొలగించి కొత్త పైపులు ఏర్పాటు చేస్తామని ఆదేష్‌కుమార్ తెలిపారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







