గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021 : రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అన్నారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత తొలిసారిగా విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం కరోనా ప్రకృతి వైపరీత్యాలతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రజల్లో ముఖ్యమంత్రికి పెరుగుతున్న ఆదరణను చూడలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి కోసం ఎలాంటి నీచ రాజకీయాలకైనా దిగజరతారన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఓటిఎస్ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. ఏజెన్సీలో ఓటీఎస్ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు. గిరిజనులు ఆర్థికంగా వెనుకబడి ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. గిరిజన ప్రాంతంలో ఓటీఎస్ కట్టకుండా త్వరలోనే గిరిజనులకు పూర్తి హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందని అన్నారు. అర్హులైన ఎవరికి రేషన్ కార్డు రద్దు చేయడం జరగలేదని, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కార్డులు మాత్రమే రద్దు చేయడం జరిగిందన్నారు. పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల విషయంలో వారసులకు భూమి విభజన ద్వారా తిరిగి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. భూపతిపాలెం ప్రధాన కాలువ పూర్తిస్థాయిలో పునరుద్ధరించి త్వరలోనే మండలంలోని ముందుగా గుర్తించిన అన్ని గ్రామాలకు సాగునీరు అందించేందుకు ఉన్నత అధికారులతో చర్చించడం జరిగిందని, త్వరలోనే శాశ్వత పరిష్కారం చేపట్టడం జరుగుతుందన్నారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి, సర్పంచ్ అక్కమ్మ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







