ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన భారత తొలి విమానవాహక నౌక (ఐఏసీ) విక్రాంత్.. ఆదివారం మరో విడత సముద్ర పరీక్షలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఇది సాగరంలో సంక్లిష్ట విన్యాసాలు నిర్వహిస్తుంది. ఆగస్టులో లాంఛనంగా ఇది నౌకాదళంలో చేరనుంది. 40 వేల టన్నుల బరువుండే విక్రాంత్.. భారత్ నిర్మించిన యుద్ధ నౌకలన్నింటిలోకీ అత్యంత సంక్లిష్టమైంది. రూ.28 వేల కోట్లతో కొచ్చిన్ షిప్ యార్డ్ దీన్ని రూపొందించింది. దీంతో ఈ సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. గత ఏడాది ఆగస్టులో ఈ యుద్ధనౌక తొలిసారిగా ఐదు రోజుల పాటు సముద్ర పరీక్షలకు బయలుదేరింది. గత అక్టోబరులో 10 రోజుల పరీక్షలు పూర్తి చేసుకుంది. మూడో విడత ప్రయోగాలను నేవల్ సైన్స్ అండ్ టెక్నోలాజికల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. ఈ యుద్ధనౌకపై మిగ్-29కే యుద్ధ విమానాలు, కామోవ్-31 హెలికాప్టర్లు, ఎం హెచ్-60 ఆర్ బహుళ ప్రయోజన హెలికాప్టర్లను మోహరించనున్నారు. 2300 కంపార్ట్ మెంట్లతో కూడిన విక్రాంత్ లో 1700 మంది సిబ్బంది ఉంటారు. మహిళా అధికారుల కోసం ప్రత్యేక వసతులను కల్పించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







