గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 నవంబర్ 2021: భారత రాజ్యాంగం కల్పించిన గిరిజనుల హక్కులను కాపాడే గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ గిరిజన సంఘం ( గిరిజన తెగల ఐక్యవేదిక) సమావేశం జిల్లా అధ్యక్షులు వెదుళ్ళ లచ్చిరెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీఓ నెం 3ను రద్దు చేయడం చాలా అన్యాయం అనన్నారు. 1/70 చట్టం పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులకు పక్కా గృహాలు ఎలా నిర్మిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూగర్భ నిక్షేపాలు గిరిజనులకే చెందాలని, ప్రభుత్వ వెబ్సైట్ నుండి కొన్ని గిరిజన ఉపకులలను ఎందుకు తొలగించారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.గిరిజన హక్కులను తెలియజేస్తూ గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. అనంతరం మండలంలోని అన్ని గిరిజన తెగలతో మండల కమిటీ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. గిరిజన హక్కులు, చట్టాలు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ వంతు బాలకృష్ణ, కార్యదర్శి జార్తా వెంకటరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు నేసం కన్నయ్య, బిజేపి జిల్లా కార్యదర్శి ఎస్.స్పప్నకుమారి, మాజీ ఎంపిపి డా.తీగల ప్రభ, మాజీ ఎంపిటిసి సభ్యురాలు కోసు బల్లియమ్మ, రంపచోడవరం మాజీ సర్పంచ్ వై. నిరంజని దేవి, మాజీ జెడ్పిటిసి సభ్యుడు పల్లాల వెంకటరమణారెడ్డి, జడేరు సర్పంచ్ చోడి మల్లికార్జున దొర, పంద్రప్రోలు సర్పంచ్ కుంజమ్ తమ్మనదొర, లక్కొండ సర్పాంచ్ ఒండోపు ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు కోటం చిన్నాలు, దొర కుంజం తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







