AP POLICE : ఏపీ పోలీస్ వెబ్ సైట్ డౌన్

UPDATED 29th JUNE 2026 9:00 AM

  • 5 రోజులుగా పనిచేయని సర్వర్
  • సామాన్యులకు తప్పని అవస్థలు 

AP POLICE WEBSITE DOWN : రాష్ట్రంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది. సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడమే లక్ష్యంగా పాలనా సంస్కరణలను వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, వేగంగా ప్రజలకు అందించేందుకు వీలుగా డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని విస్తరించడంతో పాటు, కీలకమైన ప్రభుత్వ పథకాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే నేరుగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ డిజిటల్ బాటతో అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులను సులభతరం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నూతన మార్పుతో రాబోయే రోజుల్లో రాష్ట్రం టెక్నాలజీ రంగంలో దేశానికే దిక్సూచిగా మారుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

అయితే రాష్ట్రంలో 'డిజిటల్ విప్లవం' తెచ్చామని, ప్రజలకు చేరువలో పోలీసు సేవలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను క్షేత్రస్థాయిలో అధికారులు నీరుగారుస్తున్నారు. ఏపీ పోలీస్ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్ గత ఐదు రోజులుగా మొరాయించడంతో, ప్రజలు అత్యవసర సేవల కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఏ మేరకు సాంకేతిక సన్నద్ధతతో ఉందో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది.

నిలిచిన సేవలు.. చిక్కుల్లో సామాన్యులు

ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదుల నమోదు, ఎఫ్ఐఆర్, పోలీస్ వెరిఫికేషన్లు, ఎన్ఓసీ (NOC), ఎఫ్ఐఆర్ (FIR) వంటి కీలక సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచామన్న పోలీసు శాఖ, ప్రస్తుతం ఆ వ్యవస్థను పర్యవేక్షించడంలో తీవ్ర వైఫల్యం చెందింది. వెబ్‌సైట్ పూర్తిగా నిలిచిపోవడంతో సామాన్యులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోలేక, పనుల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. డిజిటల్ యుగంలో కనీసం వెబ్‌సైట్‌ను కూడా నిరంతరం అందుబాటులో ఉంచలేకపోవడం పోలీసు సాంకేతిక విభాగం అసమర్థతకు నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రశ్నిస్తున్న ప్రజలు.. మౌనముద్రలో అధికారులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ చిన్న విషయానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. కానీ, కీలకమైన పోలీస్ శాఖ వెబ్‌సైట్ ఐదు రోజులుగా పనిచేయకపోయినా, సంబంధిత ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి అధికారిక వివరణ లేకపోవడం గమనార్హం. సమస్య ఏమిటి? ఎప్పటిలోపు పునరుద్ధరిస్తారు? అన్న కనీస సమాచారం కూడా వెల్లడించకపోవడంతో, వ్యవస్థలో ఉన్న లోపాలను అధికారులు కప్పిపుచ్చుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజా రక్షణలో నిర్లక్ష్యం

పోలీసు శాఖ వంటి కీలక విభాగంలో వెబ్‌సైట్ అంతరాయం కలగడం అనేది సాధారణ సాంకేతిక సమస్యగా పరిగణించలేమని, ఇది ప్రజా భద్రత పట్ల చూపుతున్న నిర్లక్ష్యమని ప్రజలు మండిపడుతున్నారు. వ్యవస్థలను ఆధునీకరించడం ఎంత ముఖ్యమో, వాటిని సమర్థవంతంగా నిర్వహించడం అంతకన్నా ముఖ్యం. ఇప్పటికైనా  ఉన్నతాధికారులు స్పందించి వెబ్‌సైట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని, ఇలాంటి సాంకేతిక నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us