పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 18 అక్టోబర్ 2021: డివిజన్ పరిధిలో అన్ని గ్రామ సచివాలయాల్లో, పట్టణాల్లో కోవిడ్ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి పి. వెంకటరమణ తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో సోమవారం మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 18,19,20 తేదీల్లో మూడు రోజులపాటు జరిగే కోవిడ్ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సంబంధిత శాఖల సమన్వయంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో సుమారు లక్షా 64 వేల మంది వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు ఉన్నారని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని, 50 శాతం 18 సంవత్సరాలు నిండిన మొదటి డోసు వారికి, మిగిలిన 50 శాతం రెండో డోసు వారికి వేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఉన్న వాలంటీర్లకు వారికి కేటాయించిన 50 మంది కుటుంబాల సంబంధించిన కోవిడ్ వ్యాక్సినేషన్ పై సర్వే చేపట్టే విధంగా సంబంధిత ఎంపీడీవోలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ సర్వే ద్వారా ఎంతమంది వ్యాక్సినేషన్ వేయించుకున్న వారు, వేయించుకోని వారు ఏ కారణంతో వ్యాక్సిన్ వేయించుకోలేదో తదితర అంశాలతో ఈ సర్వేను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సర్వే చేపట్టిన తర్వాత దానిని యాప్ లో అప్ లోడ్ చేయించే బాధ్యతను సంబంధిత ఎంపీడీవోలకు అప్పగించినట్లు తెలిపారు. ఈ సర్వే నివేదికను మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ డీ.ఎం.హెచ్.వోకి అందజేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కోవిడ్ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్లు ఆశావర్కర్లు వాలంటీర్లు సమన్వయంతో సర్వే పూర్తి చేసి అందరికీ వ్యాక్సిన్ జరిగేలా కృషి చేయాలని కోరారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







