గంగవరం (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపడాలని మండల విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు ఆదేశించారు. మండలంలోని నెల్లిపూడిలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, భవిత కేంద్రాలను ఆయన సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉండడంతో నూరు శాతం హాజరు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుని ఆదేశించారు. అనంతరం 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి పరిశీలించగా పలువురు విద్యార్థులు వెనుకబడి ఉండడంతో వారి కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







