తిరువనంతపురం (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కేరళ రాష్ట్రం కొట్టాయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపిన రౌడీ షీటర్.. అనంతరం మృతదేహాన్ని భుజాలపై మోసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేశాడు. తానే చంపినట్లు పెద్దగా అరిచి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. జోమోన్ కె జోస్ అనే ఓ రౌడీ షీటర్.. గంజాయి, డ్రగ్స్ దందా నిర్వహిస్తూ ఉంటాడు. పాత కక్షల కారణంగా షాన్ బాబు (19) అనే యువకుడిని అత్యంత దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి షాన్ బాబును ఇంట్లో నుంచి జోమోన్ తీసుకెళ్లాడు. ఎంత సేపటికీ తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో యువకుడి తల్లి అర్ధరాత్రి కొట్టాయం ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి పోలీసులు కూడా ఆతడి కోసం గాలిస్తున్నారు. ఓ వైపు పోలీసులు గాలిస్తుండగానే.. అర్ధరాత్రి నుంచి షాన్ బాబును జోమోన్ చిత్రహింసలకు గురిచేస్తూ కొట్టాయంలోని పలు ప్రాంతాలకు ఆటోలో తిప్పాడు. చివరకు అతను మరణించాడని భావించి పోలీసు స్టేషన్ ముందు పడేసి లొంగిపోయాడు. జోమోన్ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఠాణాకు తీసుకువచ్చినప్పుడు అతడు మద్యం, గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







