UPDATED 30th JULY 2026 8:00 PM
కాకినాడ, రెడ్ బీ న్యూస్, జూలై 30 : స్మార్ట్ సిటీ కాకినాడ వీధుల్లో ఇప్పుడు ఒకటే టాక్ ఆఫ్ ది టౌన్! మెరిసే నలుపు రంగులో.. రయ్..రయ్ అంటూ సరికొత్త 'టెస్లా' కారు ఎంట్రీ ఇవ్వడంతో సిటీ రోడ్లు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయాయి. వాహన ప్రియులు, ముఖ్యంగా కుర్రకారు ఆ హైఎండ్ ఎలక్ట్రిక్ కారు వైపే కళ్లు అప్పగించి చూస్తున్నారు.
ఏపీలోనే మొట్టమొదటిసారిగా మోడల్-వై (Model Y) హైఎండ్ వెర్షన్ టెస్లా కారును కాకినాడకు చెందిన మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు తనయుడు శ్రీనివాస్ ప్రత్యేకంగా ముంబై నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. సొగసైన ఏరోడైనమిక్ డిజైన్, ఫ్యూచరిస్టిక్ ప్రీమియం ఇంటీరియర్, సెంటర్ అట్రాక్షన్‌గా నిలిచే భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ ఫుల్ సేఫ్టీ ఫీచర్లు ఈ కారు ప్రత్యేకత. సుమారు రూ. 70 లక్షల భారీ ధర కలిగిన ఈ ఎలక్ట్రిక్ వండర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, ఏకంగా 500 నుండి 620 కిలోమీటర్ల వరకు నాన్‌స్టాప్‌గా దూసుకెళ్తుంది.
కాకినాడ రోడ్లపై ప్రత్యక్షమైన ఈ బ్లాక్ బ్యూటీని, దాని రాయల్ లుక్‌ను చూసేందుకు స్థానికులు, వాహనదారులు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కుర్రకారుకైతే ఈ కార్ లుక్స్ ఓ రేంజ్‌లో నచ్చేశాయి!







