UPDATED 28th JUNE 2026 4:00 PM
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూన్ 28: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA) కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజనల్ యూనిట్ నూతన కార్యవర్గం (2026–2029 కాలానికి) ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం పెద్దాపురం రెవెన్యూ డివిజినల్ కార్యాలయంలో ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణల అనంతరం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కె. వీరబాబు (డిప్యూటీ తహసిల్దార్, తాళ్లరేవు) ప్రకటించారు. సహాయ ఎన్నికల అధికారిగా ఎన్.వి. రమ్య (సీనియర్ అసిస్టెంట్, DSO కార్యాలయం), ఎన్నికల పరిశీలకులుగా సామర్లకోట తహసిల్దార్ ఎస్.కె. చంద్రశేఖర రెడ్డి వ్యవహరించారు.
నూతన కార్యవర్గ వివరాలు:
- అధ్యక్షులు: ఎం.వి.వి. భాను కుమార్ (డిప్యూటీ తహసిల్దార్, పెద్దాపురం)
- అసోసియేట్ అధ్యక్షులు: టి. కాంతారావు (తహసిల్దార్, తొండంగి)
- ఉపాధ్యక్షులు: ఎస్. పొన్నాలు (జనరల్), కె. పుణ్యవతి (మహిళ)
- ప్రధాన కార్యదర్శి: కె. ఆనంద్ (సీనియర్ అసిస్టెంట్, కిర్లంపూడి)
- సంయుక్త కార్యదర్శులు: ఎస్. కిరణ్ కుమార్, కె. గీత (మహిళా రిజర్వు), కె. సన్యాసిరావు (ఆఫీస్ సబార్డినేట్ రిజర్వు)
- కోశాధికారి: పి. శ్రీనివాసు (తహసిల్దార్, పెద్దాపురం)
- కార్యవర్గ సభ్యులు: పి. శ్రీనివాసు (జూనియర్ అసిస్టెంట్), ఎం. కామరాజు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని APRSA కాకినాడ జిల్లా అధ్యక్షులు పి. త్రినాథరావు, ప్రధాన కార్యదర్శి ఎస్. రామ్ మోహన్ రావు అభినందించారు. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి నూతన సంఘం సమిష్టిగా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. డివిజన్ పరిధిలోని తహసిల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది నూతన బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.







