గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏటిపల్లి ఆశ కార్యకర్త ముర్ల చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ పోరాటం ఆపేదిలేదని ఇటీవల మృతి చెందిన ఐదుగురు ఆశా కార్యకర్తల కుటుంబాలను ఆదుకునే వరకు పోరాటం ఆగదని సీఐటీయూ నాయకులు చెల్లయమ్మ, రమణమ్మ తెలిపారు. ప్రభుత్వం ఐటీడీఏ అధికారులు తక్షణమే స్పందించి మృతిచెందిన ఆశా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







