లాహోర్ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: మరోసారి బాంబు పేలుడు కలకలం రేపుతోంది. లాహోర్ లోని లహరీ గేట్ వద్ద భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా, మరో 20 మందికి గాయాలు అయ్యాయి. అనార్కలీ బజార్ లో బాంబు పేలుడు సంభవించింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు ప్రాంతాన్ని అక్కడి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పేలుడు ఘటనపై విచారణ జరుపుతున్నామని లాహోర్ డీఐజీ పేర్కొన్నారు. ఐఈడీ పేలుడా? టైమ్ బాంబా అనే దానిపై ప్రస్తుతం విచారణ మొదలుపెట్టినట్లుగా తెలిపారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







