కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం రూ. ఐదు వేల రూపాయలు సంక్షేమ బోర్డు నిధుల నుంచి ఇచ్చే విధంగా వెంటనే నిధులు విడుదల చేయాలని లేబర్ కార్మికశాఖాధికారికి బుధవారం మెమెురాండం పెద్దాపురం మండల సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో అందచేశారు. ఈ సందర్బంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గడిగట్ల సత్తిబాబు మాట్లాడుతూ కేరళలో దాదాపు 45 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు రూ. 5 వేల చొప్పున అందిస్తున్నారని అన్నారు. అలాగే డిల్లీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు రూ.5 వేల రూపాయలు అందిస్తుందని అన్నారు. మన రాష్ట్రంలో ఇసుక సమస్యతో పనులు కొల్పోయారని మళ్లీ ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో పనులు కొల్పోతారని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి నిధులు విడుదల చేసి ప్రతి భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి రూ. 5 వేలు విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ, అధ్యక్షులు తాడిశెట్టి గంగ, పెదిరెడ్ల విష్ణు, లంక చంటి, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గూనూరు రమణ, కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు గమ్మరేగుల రమణ, బ్రహ్మాజీ, శివ పార్వతి కార్పెంటర్ యూనియన్ బొడ్డు అప్పన్న, లావేటి శివ, సిఐటియు నాయకులు నీలపాల సూరిబాబు, డి.క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







