గంగవరం, 10 అక్టోబరు 2020(రెడ్ బీ న్యూస్): ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మండల కేంద్రమైన గంగవరంలో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో శనివారం వారూ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. నేడు జగనన్న విద్యా కానుకల ద్వారా ప్రతి విద్యార్థికి పుస్తకాలు, బట్టలు, స్కూల్ బ్యాగులు, బూట్లు వంటి వాటిని ఉచితంగా ఇవ్వడం జరుగుతోందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రతిభా పురస్కారాలు అందుకున్న ముగ్గురు విద్యార్థులకు ట్యాబ్ లను వారి చేతులమీదుగా అందచేశారు. తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో జాన్ మిల్టన్, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సిహెచ్ రమణ, ఎయిడెడ్ స్కూల్ హెచ్.ఎం రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







