గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకర్ వర్మ కోరారు. మండలంలోని కొత్తడలో యుటిఎఫ్ మండలశాఖ మహాసభ మండల శాఖ అధ్యక్షుడు రఘుబాబు దొర అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యాశాఖలో వస్తున్న అనూహ్య పరిణామాలు పరిస్థితులను ప్రతి ఒక ఉపాధ్యాయుడు గమనించాలని భవిష్యత్తులో ఉపాధ్యాయులు మనుగడ నియామకాలు వంటివి క్లిష్టతరం అయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి సాయిరాం మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధన చేస్తూనే న్యాయబద్ధంగా రావలసిన పీ.ఆర్.సీ డీఏ కోసం పోరాటనికి సిద్ధం అవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె. కృష్ణ గౌరవ అధ్యక్షుడు రాంబాబు, యుటిఎఫ్ నాయకులు చిన్నబాబు, నాగమణి రుక్మిణి దేవి, లక్ష్మి తదితరులు ఉన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







