రెడ్ బీ న్యూస్, 31 డిసెంబర్ 2021: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిప్‌ల కొరతను తట్టుకొని ఎట్టకేలకు ఓలా తొలిబ్యాచ్ ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను పూర్తిచేసింది. ఇప్పటికే వీటిపై సుదర్ఘమైన వెయిటింగ్ పిరియడ్ ఉంది. ఈ విషయాన్ని ఓలా స్కూటర్స్ సీఈవో భవేష్ అగర్వాల్ ఒక ట్వీట్‌లో తెలిపారు. ‘‘మా వాహనాలు కొనుగోలు చేసిన వారికి డెలివరీలను పూర్తి చేశాం. కొన్ని మార్గం మధ్యలో ఉన్నాయి. చాలా వరకు డెలివరీ సెంటర్ల వద్ద ఉన్నాయి. ఆర్టీవో రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత వినియోగదారులకు చేరనున్నాయి. అందరికీ డిజిటల్ విధానం కొత్త కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనుకున్న దానికంటే మందకొడిగా జరుగుతోంది’’ అని అగర్వాల్ వెల్లడించారు. ఓలా డిసెంబర్ 15 నుంచి ఎస్1, ఎస్1 ప్రో డెలివరీలను మొదలుపెట్టింది. దీంతోపాటు తొలి 100 మంది కస్టమర్ల కోసం బెంగళూరు, చైనా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అరుణ్ శ్రీదేశ్‌ముఖ్ ఇటీవల మాట్లాడుతూ ‘‘మాకు కస్టమర్లే అత్యంత ముఖ్యం. అన్ని చోట్ల నుంచి సానుకూల ఫీడ్‌బ్యాక్ లభించింది. చాలామంది వినియోగదారులు రవాణాకు సంబంధించిన సమస్యలను మా దృష్టికి తెచ్చారు. మేం ఆ సమస్యను వేగంగా పరిష్కరించాం’’ అని పేర్కొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







