BREAKING : పెళ్లి బృందం వాహనానికి ప్రమాదం

UPDATED 13th MAY 2026 5:10 PM

చెట్టును ఢీకొట్టిన బొలెరో.. 15 మందికి గాయాలు.. ఒకరు మృతి..!

​పెద్దాపురం : కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నపిల్లలతో సహా మొత్తం 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన వివరాలు..

​పెద్దాపురం మండలం ఆర్బీ కొత్తూరు గ్రామానికి చెందిన కొందరు శుభకార్యం ముగించుకుని బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా, గండేపల్లి మండలం పి.నాయికంపల్లి వద్ద ఈ ప్రమాదం సంభవించింది. వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో లోపల ఉన్న ప్రయాణికులందరూ గాయపడ్డారు..

ఆసుపత్రిలో ఆర్తనాదాలు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణమంతా గాయపడిన వారి కేకలు, బంధువుల ఆర్తనాదాలతో అత్యంత భయానకంగా మారింది. బాధితులందరికీ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు.

పోలీసుల పర్యవేక్షణ

​సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. డిఎస్పీ ఏబిజీ తిలక్, సీఐ వై ఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ మౌనిక ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్న పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us