గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 అక్టోబర్ 2021 : పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు ) సంబంధించి ఆర్ అండ్ ఆర్ కాలనీలు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను పోలవరం ప్రాజెక్టు
ఆర్ అండ్ ఆర్ కమిషనర్ సి. శ్రీధర్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కాలనీలకు సంబంధించిన ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఓ. ఆనంద్, రంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ముంపునకు గురైన గ్రామాలకు సంబంధించిన బాధితులకు ఆర్ అండ్ ఆర్ చట్ట ప్రకారం బాధితులందరికీ ప్యాకేజీ అమలు చేయడం జరుగుతుందన్నారు. చాలావరకు ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్మించడం జరిగిందని, చాలా గ్రామాల ప్రజలు ముంపునకు గురైన వారికి ఏర్పాటుచేసిన ఆర్ అండ్ ఆర్ కాలనీలకు రావడం జరిగిందని, కొన్ని కాలనీలు కట్టవలసి ఉన్నదని, మిగిలిన కాలనీలు వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి పూర్తి చేయాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలలో ముఖ్యంగా త్రాగునీరు, కరెంటు, అంగన్వాడి కేంద్రం, స్కూలు, సీసీ రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ఏర్పాటు చేయాలని కమిషనర్ సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు వలన కొంతమంది మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఏర్పాటు చేయాలని, 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పోలవరం ముంపునకు గురైన ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో సత్యసాయి త్రాగునీరు ఏర్పాటు చేయాలని ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలని, ముంపు బాధితులు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇల్లు కట్టే ముందు వివిధ రకాల మెటీరియల్ అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మించేటప్పుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇల్లు నిర్మించేటప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు రావాలని సంబంధిత ఇంజనీర్లను కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ ఆర్ జేడీఏ లక్ష్మీకుమారి, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఈఈ లు పి.రమాదేవి, నాగేశ్వరరావు, సత్యనారాయణ మూర్తి, సత్యనారాయణ, MD యూసఫ్, డీఈలు కృష్ణ, రాజా, వేణుగోపాల్, శ్రీనివాస రావు, డేవిడ్, దుర్గాప్రసాద్, డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ సర్వే కె. దేవేంద్రుడు, తహశీల్దార్ వీర్రాజు, శ్రీమన్నారాయణ ఏఈలు, జేఈలు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







