తిరుపతి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021 : ఈనెల 17న తిరుపతిలో నిర్వహించతలపెట్టిన అమరావతి పరిరక్షణ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని సమితి నాయకులు ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి న్యాయస్థానం నుంచి తిరుపతి దేవస్థానం వరకు సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నామని లేఖలో ఎస్పీకి తెలియజేశారు. 17వ తేదీన పాదయాత్ర తిరుపతికి చేరుకుంటుందని, అదేరోజున తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతి మంజూరుచేసి సహకరించాలని సమితి ప్రఽధాన కార్యదర్శి తిరుపతిరావు అభ్యర్థించారు. శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా, కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ సభను నిర్వహించుకుంటామని హామీ ఇస్తూ అనుమతిని కోరారు. బహిరంగ సభకు సంబంధించిన పూర్తివివరాలు అందించాలని ఎస్పీ సమితి నాయకులను కోరారు. వారినుంచి సమాచారం అందిన తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







