గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీమేరకు వృద్ధులు, వితంతువులకు పెంచిన పెన్షన్ ను ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం చేతులమీదుగా అందచేశారు. ఎంపీడీవో జాన్ మిల్టన్ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. మండలంలో అర్హులైన సుమారు 4 వేల మందికి రూ. 95 లక్షల పంపిణీ చేయడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు. అలాగే కొత్తగా జనవరి నెలకు సంబంధించి 88 పింఛన్లు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలుముల అక్కమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి, కార్యదర్శి శాంతి తదితరులు ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







