గంగవరం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు నిర్మల హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏటిపల్లి ఆశ కార్యకర్త ముర్ల చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గంగవరంలో సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు సోమవారానికి ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు నిర్మల సందర్శించి ఆశ వర్కర్ల దీక్షకు సంఘీభావం తెలిపి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారి మృతి చెందింది నెల రోజులు కావస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడం శోచనీయం అన్నారు. డ్యూటీ పేరుతో ఆశ వర్కర్లను వైద్యులు, వైద్య సిబ్బంది వేధింపులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. వైద్యాధికారుల వేధింపుల వల్లే చిన్నారి తీవ్ర ఒత్తిడికి గురైందన్నారు. ఆమె కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్ల నాయకురాలు మార్తమ్మ, మంగయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







