ఏడు అడుగుల బంధం... ఆస్ట్రేలియా నుంచి వచ్చి తెలుగు నేలపై వేద మంత్రాల సాక్షిగా!

UPDATED 29th AUGUST 2026 10:00 PM

 విశాఖపట్నం, రెడ్ బీ న్యూస్, ఆగష్టు 29:  స్నేహితుడి పెళ్ళిలో అక్షింతలు వేసేందుకు ఏడు సముద్రాలు దాటి వచ్చిన ఆ ఆస్ట్రేలియా జంట, తామే పెళ్ళి పీటలు ఎక్కుతారని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. మన ఆతిథ్యం, హిందూ సంప్రదాయంలో ఉన్న పవిత్రత ఆ విదేశీ మనసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కథలోని అసలు ట్విస్ట్: అతిథులుగా వచ్చి... వధూవరులుగా మారి!

​విజయనగరం సీఐ ఎస్.విద్యారత్నాకర్ కుమారుడు రణసూర్య ఆస్ట్రేలియా జైళ్ల శాఖలో పనిచేస్తున్నారు. తన పెళ్ళి వేడుకకు రావాల్సిందిగా తనతో పాటు పనిచేసే ఆస్ట్రేలియన్ మిత్రుడు బ్రాడీని ఆహ్వానించారు. మిత్రుడి పిలుపును అందుకుని బ్రాడీ తన కాబోయే భార్య ఇమలి, కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నంలోని షీలానగర్ సమన్వయ్ కన్వెన్షన్ హాలుకు చేరుకున్నారు.

మనసు దోచిన 'హిందూ సంప్రదాయం'

​విశాఖ తీరంలో రణసూర్య వివాహ వేడుక వైభవంగా జరుగుతోంది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల సప్పుడు, అగ్నిహోత్రం చుట్టూ తిరిగే ఏడడుగులు, పూలమాలల సౌందర్యం బ్రాడీ-ఇమలి జంటను కట్టిపడేసాయి. పెళ్ళి లోని ప్రతీ ఘట్టం వెనుక ఉన్న అర్థాన్ని, పవిత్రతను తెలుసుకుని వారు మైమరచిపోయారు.

అదే కళ్యాణ వేదిక... కొత్త పీటలు!

​హిందూ సంస్కృతికి ఫిదా అయిపోయిన ఈ ఆస్ట్రేలియా జంట ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. "మనం కూడా ఈ పవిత్రమైన పద్ధతిలోనే ఒక్కటవుదాం!" అని నిశ్చయించుకున్నారు. మిత్రుడి పెళ్ళి పూర్తయిన వెంటనే, అదే కళ్యాణ వేదికపై హిందూ సంప్రదాయబద్ధంగా పీటలు ఎక్కారు. వేద పండితుల మంత్రాల నడుమ, సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ పూలమాలలు మార్చుకున్నారు.

​పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులంతా ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతూనే, ఆ విదేశీ జంటపై అక్షతలు చల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు."హిందూ సంస్కృతి, సంప్రదాయాలంటే మాకు అపారమైన గౌరవం. స్నేహితుడి పెళ్ళికి వచ్చి ఈ పద్ధతులు చూశాక, ఇక్కడే వివాహం చేసుకోవాలనే కోరిక ఆగలేదు. ఈ అనుభవం మా జీవితంలో మర్చిపోలేనిది!"

పసిఫిక్ దాటి వచ్చి ఒక్కటైన బ్రాడీ - ఇమలి జంట

​ఒకే వేదిక, రెండు పెళ్ళిళ్ళు, ఎల్లలు లేని సంస్కృతి! మన సంప్రదాయం ఎంత గొప్పదో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us