APUWJ : ఉత్సాహంగా ఏపీయూడబ్ల్యూజే కార్తీక వన సమారాధన

UPDATED 23rd NOVEMBER 2022 WEDNESDAY 4:10 PM

ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా, రాష్ట్ర నాయకులు 

పెద్దాపురం నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

APUWJపీయూడబ్ల్యూజే కార్తీక వన సమారాధన, ఆత్మీయ సమావేశం మండలంలోని పులిమేరు శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో బుధవారం ఉత్సాహంగా  జరిగింది. ఐజేయు (IJU)  జాతీయ సభ్యుడు రాకుర్తి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీయూడబ్ల్యూజే (APUWJ) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు స్వాతి ప్రసాద్, ఐజేయు రాష్ట్ర నాయకుడు మండేల శ్రీరామ్మూర్తి,  స్టేట్ కౌన్సిల్ (State Council) సభ్యుడు అంజిబాబు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర ప్రసాద్, జిల్లా కార్యదర్శి వెలిది వెంకటరత్నం పాల్గొని ప్రసంగించారు. జిల్లా, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం నూతన కమిటీ ఎంపిక ప్రక్రియ జరిగింది.

నియోజకవర్గ కమిటీగా ఎన్నికైంది వీరే..

గౌరవ అధ్యక్షులుగా అడపా వెంకట్రావు (సాక్షి, సామర్లకోట), అధ్యక్షుడుగా చవ్వాకుల ఈశ్వరరావు (ఆంధ్రప్రభ, పెద్దాపురం) కార్యదర్శిగా పొలిమాటి విజయ్ కుమార్ (ఈనాడు, సామర్లకోట), ఉపాధ్యక్షులుగా బిక్కిన వెంకట్ (రెడ్ బీ న్యూస్, సామర్లకోట), బద్ది కుమార్, (కోస్తా సమయం పెద్దాపురం), ప్రధాన కార్యదర్శిగా  ఉప్పలపాటి చంద్రదాస్ (నేటి రధ సారధి, సామర్లకోట), సహాయ కార్యదర్శిలుగా మొల్లి సూర్యనారాయణ (విజయభాను, పెద్దాపురం), గోవిందలపూడి సుబ్రహ్మణ్యం, (మా న్యూస్, సామర్లకోట ), కోశాధికారిగా పెమ్మడి వీరభద్రవర్మ  (ఆంధ్రప్రభ , సామర్లకోట), కార్యవర్గ సభ్యులుగా బి.బుజ్జిబాబు (వార్త, పెద్దాపురం), ఎలిశెట్టి సత్యనారాయణ, (విశాలాంధ్ర సామర్లకోట), ఎం. ఆంజనేయ పాల్, ( శ్రీ చక్ర న్యూస్, పెద్దాపురం) సిద్దిరెడ్డి సూరిబాబు (ప్రజాజ్వాల, సామర్లకోట)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా  స్వాతిప్రసాద్, మండేలా శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ (COVID) కారణంగా ముఖ్య కార్యవర్గం మాత్రమే సమావేశాలకు హాజరవ్వడం జరిగిందన్నారు. సర్వసభ్య సమావేశాలకు దూరంగా ఉన్నామన్నారు. తొలుత జగ్గంపేట, అమలాపురం తరువాత ఇప్పుడు పెద్దాపురంలో జరిగిన ఈ ఆత్మీయ కలయికలు నాందిగా అన్ని నియోజకవర్గాల్లోనూ సమావేశాలు జరగాలన్నారు. విలేకరుల సమస్యల పరిష్కారానికి ఏపీయూడబ్ల్యూజే, ఐజెయు దశాబ్దాల కాలంగా కృషి చేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఐజెయు చేస్తున్న పోరాటాలు జర్నలిస్ట్ లకు మంచి జరగాలని క్షేత్రస్థాయి నుంచి ఐజేయు, ఏపీయూడబ్ల్యూజేలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా సీనియర్ జర్నలిస్ట్ లు మొల్లి సూర్యనారాయణ, అడపా వెంకట్రావు పతాకావిష్కరణ చేయగా, ఐజేయు సభ్యుడు రాకుర్తి రాంబాబు అధ్యక్షత వహించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులుతో కలిసి సహపంక్తి భోజనాలను చేశారు.

ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎన్.పి.ఎస్ వినాయక్, రాయవరపు వీరబాబు, ఎన్. శ్రీరామ్, జగ్గంపేట నియోజకవర్గ నాయకులు అడపా వెంకట్రావు, కుమార్ పాల్, అడపా శ్రీనివాస్, ఉడతా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us