అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పీఆర్‌సీ నివేదికపై సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన భేటీ ముగిసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. జీతాల పెంపు అమలు తేదీలపైనా సమావేశంలో చర్చ జరిగింది. పెంచిన జీతాలను 2018 జులై నుంచి వర్తించజేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల తరఫున ఐకాస నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పీర్‌సీ సహా 71 డిమాండ్లపై సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానికి నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







