గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: మండలంలోని కొమరవరం అంగన్వాడీ కేంద్రం లోని పిల్లలకు అవేర్ ఫౌండేషన్ సమకూర్చిన గ్లాసులు కంచాలను మరిపాలెం సర్పంచ్ మడకం వెంకటేశ్వర్లు మంగళవారం పంపిణీ చేశారు. అవేర్ ఫౌండేషన్ గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల వల్ల గిరిజనులు లబ్ధి పొందుతున్నారని, వారి సేవలు మరువలేనివన్నారు. అవేర్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏజెన్సీలో సమస్యల పరిష్కారానికి తమ సంస్థ ఛైర్మన్ జి. మాధవన్ తనవంతు కృషి చేస్తున్నారన్నారు.ఈ ప్రాంతాల్లో ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి సుమారు 15 హ్యాండ్ బోర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే గిరి జిల్లా ఆర్థిక అభివృద్ధి కోసం స్వయం ఉపాధి కల్పన క్రింద గిరిజనులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రామయ్యమ్మ, అక్కమ్మ అవేర్ ప్రతినిధి ప్రసన్న తదితరులు ఉన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







