కటక్ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : కొత్త సంవత్సరం వేడుకల్లో విందు కోసమని పోలీసులు రెండు మేకలను దొంగలించారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్ జిల్లా సింధికెల గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంకీర్తనగురు మేకల మందలో రెండు కనిపించకపోవడంతో పోలీసులే దొంగిలించారని తెలుసుకొని.. స్టేషన్ వెనుక వాటిని కోసేందుకు చూస్తుండగా వెళ్లి అడ్డుకున్నారు. అయినా.. పోలీసులు వినలేదు. దీంతో సంకీర్తనగురు గ్రామస్థులకు విషయం చెప్పి, ఫిర్యాదు చేసేందుకు మళ్లీ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు సంకీర్తనగురును బెదిరించారు. విషయం ఎస్పీ నితిన్ శుక్లాకర్ దృష్టికి వెళ్లింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి ఏఎస్‌ఐ సుమన్ మల్లిక్‌ను శనివారం సస్పెండు చేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







