గంగవరం (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022: మరణించిన ఆశ వర్కర్ల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఆశ వర్కర్ల దీక్ష విరమించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వంశీకృష్ణ కోరారు. ఆశా వర్కర్లు గంగవరంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మంగళవారానికి ఇరవై రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ సందర్శించి ఆశా వర్కర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం, మెడికల్ ఆఫీసర్ లపై చర్యలు తీసుకునే వరకు దీక్ష విరమించేది లేదని వారు తేల్చి చెప్పడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







