లండన్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : ఓ మహిళ.. తన పిల్లల కోసం తెచ్చిన పౌష్టికాహారం (సిరియల్) డబ్బాను తెరిచి ఓ గిన్నెలో పోస్తున్నారు. ఇంతలో డబ్బాలో ఏదో అడ్డుపడుతున్నట్లు గుర్తించారు. తీరా ఓ కవర్ బయటపడగా అందులో తెల్లరంగు క్రిస్టల్స్ కనిపించాయి. అవేంటో తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో వెతికిన ఆమెకు.. ఒక్కసారిగా షాక్ తగిలింది! కారణం.. అది మెథాంఫేటమిన్ (క్రిస్టల్ మెథ్) మాదకద్రవ్యంగా తేలడమే. ఈ వ్యవహారం బ్రిటన్‌లో తాజాగా వెలుగుచూసింది. దీంతో ఆందోళనకు గురైన ఆ మహిళ.. వెంటనే ఆ కవర్‌ను పోలీసులకు అప్పగించినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. మరోవైపు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లి, పరీక్షలు చేయించగా.. అదృష్టవశాత్తు వారిలో డ్రగ్ ఆనవాళ్లు దొరకలేదని ఆమె చెప్పారు. ‘ఈ ఘటనతో నిజంగా షాక్‌కు గురయ్యా. సిరియల్ డబ్బాలో ఈ డ్రగ్స్ ప్యాకెట్ సగం వరకు ఉంది. దాదాపు 450 గ్రాముల క్రిస్టల్ మెథ్ బయటపడింది. ఆ కవర్ కూడా పలుచగా ఉండటంతో.. ఆ డ్రగ్స్ సిరియల్‌లో కలిసిపోయిందనుకున్నా. కానీ, పిల్లలకు ఏం కాకపోవడం అదృష్టం’ అని ఆ మహిళ చెప్పుకొచ్చారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ డ్రగ్స్ ప్యాకెట్‌ను అందులో ఎవరు పెట్టారో గుర్తించేందుకు యత్నిస్తున్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







