కాకినాడ (రెడ్ బీ న్యూస్)1 నవంబర్ 2021: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సోమవారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రామారావుపేటలో పొట్టి శ్రీరాములు విగ్రహం కూడలి వద్ద జాతీయ పతాకాన్ని కలెక్టర్ సి.హరికిరణ్ ఎగురవేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగనిరతి ఫలితంగా తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. ఆ మహానీయునికి ఘన నివాళి అర్పించి స్మరించుకోవడం మనందరి బాధ్యతన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు వెళ్లడం ప్రతిఒక్కరి బాధ్యతన్నారు. నవంబరు 1 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడానికి సీఎం జగన్ చొరవ ప్రశంసనీయమన్నారు. జాతీయ గీతాలాపన, మా తెలుగుతల్లికి మల్లెపూదండ గీతాలాపన, పోలీసుల గౌరవ వందన సమర్పణ అలరించాయి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, జేసీలు కీర్తి, భార్గవ్‌తేజ, కాకినాడ మేయర్ సుంకర శివప్రసన్న, ఉప మేయర్లు ఉదయకుమార్, సత్యప్రసాద్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్, డీఆర్వో సత్తిబాబు, కుడా ఛైర్‌పర్సన్ చంద్రకళాదీప్తి, డీసీసీబీ ఛైర్మన్ ఆకుల వీర్రాజు జడ్పీ సీఈవో సత్యనారాయణ, ఆర్డీవో చిన్నికృష్ణ, డీఆర్‌డీఏ పీడీ శ్రీరమణి, మెప్మా పీడీ ప్రియంవద, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, వికాస పీడీ కె.లచ్చారావు, జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది, పాఠశాల, కళాశాలల విద్యార్థులు, ఆర్య వైశ్య సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







