UPDATED 3rd JUNE 2026 6:00 PM
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూన్ 3 : కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత డాక్టర్ తాళాబత్తుల సాయి చేవ కర్రపై మరో అద్భుత సూక్ష్మ శిల్పాన్ని ఆవిష్కరించారు. ఒక వ్యక్తి గొడ్డలితో కర్రను నరుకుతున్నట్లుగా ఉన్న ఈ అరుదైన కళాఖండాన్ని ఆయన కేవలం ఒక గంట వ్యవధిలోనే పూర్తి చేయడం విశేషం.
కేవలం 16 మిల్లీమీటర్ల ఎత్తు, 8 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ సూక్ష్మ శిల్పాన్ని అత్యంత దృఢమైన చేవ కర్రపై చెక్కడం విశేషం.
ఎంతో తృప్తినిచ్చింది: డాక్టర్ తాళాబత్తుల సాయి
ఈ సందర్భంగా మైక్రో ఆర్టిస్ట్ డాక్టర్ సాయి మాట్లాడుతూ.. సాధారణంగా గట్టిగా ఉండే చేవ కర్రపై సూక్ష్మ శిల్పాలు చెక్కడం ఎంతో సవాలుతో కూడుకున్న పని అని, అయితే ఈ గొడ్డలి శిల్పాన్ని అనుకున్న సమయంలోగా చెక్కడం తనకు ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు.
మైక్రో ఆర్టిస్ట్‌గా, చిత్రకారుడిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన డాక్టర్ సాయి సృష్టించిన ఈ సరికొత్త కళాఖండం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన ప్రతిభను అభినందిస్తూ పలువురు కళాభిమానులు, ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.







