రెడ్ బీ న్యూస్,31 డిసెంబర్ 2021: యూట్యూబ్ చూసి చాలామంది వంటలు, ఇతరత్రా పనులు నేర్చుకుంటారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పుండలీక నగర్‌కు చెందిన ఇంజినీర్ సమ్రాన్(30) అలియాస్ లక్కీ నకిలీనోట్ల తయారీ నేర్చుకున్నాడు. ఓ గదిలో ముద్రణ యంత్రం ఏర్పాటు చేశాడు. దొంగనోట్లు తయారుచేసి చిన్నచిన్న దుకాణాల్లో, బెల్టుషాపుల్లో చలామణి ప్రారంభించాడు. ఓ వైన్‌షాపు యజమాని ఫిర్యాదుతో విషయం పోలీసులకు తెలిసింది. ఏఎస్‌ఐ శేష్‌రావ్ ఖటానే బృందం.. నిఘా పెట్టింది. దొంగనోట్ల చలామణి కేసులో అరెస్టయి బెయిలుపై బయటకువచ్చిన రంగనాథ్ వైన్‌షాపు వద్ద కనిపించగా.. ఆరా తీశారు. సమ్రాన్ గుట్టు బయటపడింది. కలర్ ప్రింటర్లు, రూ.1,20,000 నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమ్రాన్‌తోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







