గంగవరం (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్ ఆరోపించారు. మండలంలోని దొరమామిడి, ఆమదాలబంద గ్రామాల్లో గౌరవ సభ కార్యక్రమం టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అధిక ధరలు, నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహ నిర్మాణ లబ్ధిదారుల నుంచి ఓటిఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. డ్వాక్రా మహిళల పొదుపు సొమ్మును తిరిగి బ్యాంకులో వేయాలని బీసీ కార్పొరేషన్ కాపాడాలని వారు డిమాండ్ చేశారు. రెండు పంచాయతీల్లోనూ గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే కొత్త కార్యక్రమాలు కానరావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, ఆదినారాయణ, టీడీపీ నాయకులు భాను ప్రకాష్, శేషమ్మ, చవలం బాపిరాజు, సురేష్ కృష్ణ, వెంకట్ రెడ్డి, సత్యవతి, సూరమ్మ, నరసన్న దొర, వీరబాబు, బండి చిన్న వెంకటరమణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







