పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలను ఆదుకోవడానికి శాశ్వత గృహ హక్కు పథకం ఒక వరమని ఆర్డీవో పి.వెంకటరమణ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సభ్యులతో ఓటీఎస్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆర్డీవో మాట్లాడుతూ జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంతో యజమానులకు లబ్ధి చేకూరుతుందని, దీనిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమం ద్వారా మెప్మా సంఘ సభ్యులు పొదుపు ఖాతాలో ఉన్న సొమ్మును ఓటీఎస్ కు ఉపయోగపడేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. 1983 సంవత్సరం నుంచి 2013 సంవత్సరానికి సంబంధించి హౌసింగ్ ద్వారా రుణం పొందిన లబ్ధిదారులుకు ఓటీఎస్ ద్వారా పట్టణంలో రూ.15 వేల సొమ్మును జమ చేసినట్లయితే వారికి ఉచిత రిజిస్ట్రేషన్ ద్వారా ఆ ఇంటిపై సంపూర్ణమైన హక్కు లభిస్తుందన్నారు. దీనివల్ల అవసరమైతే గృహాన్ని అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి, దానిపై బ్యాంకు ద్వారా రుణం పొందవచ్చని ఆర్డివో తెలిపారు. ఈ పథకాన్ని బలవంతంగా కట్టవలసిన పనిలేదని, వారికి పూర్తిస్థాయిలో దీనివల్ల ప్రయోజనాలను వివరించి, వారి ప్రయోజనం పొందే విధంగా వారికి వివరించాలని తెలిపారు. అదేవిధంగా సొమ్మును 15 రోజులలో 3 వాయిదాలలో చెల్లించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు వినియోగించుకునేలా కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు కృషిచేసి పేద వారికి ప్రభుత్వం తరపున మంచి జరిగేలా కృషి చేయాలని కౌన్సిలర్లకు ఆర్డీవో సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి కౌన్సిలర్లు లబ్ధిదారులు యొక్క సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకురాగా వాటిని సంబంధించిన సమాచారాన్ని వారికి వివరించారు. ఈకార్యక్రమంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇంటిపై పూర్తి స్వేచ్ఛ వస్తుందని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ మాట్లాడుతూ పెద్దాపురం పట్టణంలో కౌన్సిలర్లు, వార్డులోని లబ్ధిదారులకు ఈ పథకం యొక్క ప్రయోజనాలు తెలిపి ఈ పథకాన్ని ఎక్కువమంది వినియోగించుకునే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ టీపీవో ఎస్.ఉమామహేశ్వరరావు, మెప్మా సీఎంఎం వెంకటలక్ష్మి, మున్సిపల్ మేనేజర్ నూకరాజు, మున్సిపల్ అధికారులు, మెప్మా రిసోర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







