కాకినాడ (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: దీర్ఘకాలం తరువాత కలెక్టరేట్‌లో మంగళవారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్‌సీ) సమావేశాన్ని నిర్వహించారు. జేఎస్‌సీ ఛైర్మన్, కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి గుర్తింపు పొందిన 15 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్స్, కారుణ్య నియామకాలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఎంప్లాయీస్ రెగ్యులైజేషన్, హెల్త్‌కార్డులకు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రుణాలు జారీ, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్, పదవీ విరమణ గ్రాట్యూటీ సకాలంలో అందించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ.. స్థానికంగా పరిష్కరించే అంశాలను వెంటనే పూర్తి చేస్తామన్నారు. కొవిడ్‌తో మరణించిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు అదే పోస్టులో ఉద్యోగం కల్పించే విధంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతీ సోమ, శనివారాలు కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంటానని, సమస్యలుంటే నేరుగా సంప్రదించాలని సూచించారు. డీఆర్వో సీహెచ్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







