రెడ్ బీ న్యూస్ : ఇంట్లో ఏ పూజ జరిగినా పూలు, పండ్లతో పాటు ముఖ్యంగా కనిపించేవి తమలపాకులే.. ఇవి కేవలం పూజలకు మాత్రమే కాదు.. అనేకానేక ఆరోగ్య సమస్యలకు సైతం సంజీవనిగా కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు తమలపాకులు నమలితే చాలు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయట. నోటి పూత, నోటి దుర్వాసన తమలపాకు నమలడం ద్వారా తగ్గుతుంది. చిగుళ్లకు మేలుచేస్తుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.. దగ్గు, ఆయాసంతో బాధపడతున్న పిల్లలకు… తమలపాకులను ఆవనూనెలో నానపెట్టి కొద్దిగా వేడిచేసి చాతీపై రుద్దాలి. ఇలా చేస్తే వారికి ఉపశమనం కలుగుతుంది. తమలపాకు రసాన్ని గొంతు భాగంలో రుద్దితే గొంతు మంట, ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉంటే తగ్గుతుంది. గాయాలు వేధిస్తున్నట్లయితే తమలపాకులను నూరి, ఆ రసాన్ని వాటిపై రాస్తే త్వరగా మానిపోతాయి. వెన్ను నొప్పితో బాధపడుతున్న వాళ్లు… కొబ్బరినూనెలో తమలపాకుల రసాన్ని కలిపి వీపు వెనుక భాగంలో రాసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక చెవి పోటుతో కలిగే బాధ వర్ణనాతీతం. కొన్ని చుక్కల తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. అజీర్తి చేసినపుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







