కాకినాడ (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: గర్భస్థ పిండ ఆరోగ్య స్థితిని పరీక్షించేందుకు అందుబాటులోకి వచ్చిన ఆల్ట్రా స్కానింగ్ వంటి సదుపాయాలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో కేవీఎస్ గౌరీశ్వరరావు హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో పీసీపీఎన్‌టీడీపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల రేడియాలజిస్టులు, సోనోలజిస్టులు, జిల్లా, డివిజన్ స్థాయి అథారిటీ, సలహా కమిటీ సభ్యులకు మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (హైదరాబాద్) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.రవికిరణ్‌శర్మ రిసోర్స్‌పర్సన్‌గా వ్యవహరించారు. వివిధ రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న స్త్రీ, పురుష అసమతుల్యం, తద్వారా సామాజికంగా తలెత్తుతున్న రుగ్మతలు, ఎదురయ్యే సవాళ్లను వివరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటబుద్ధ, రేడియాలజీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ డీబీ అనురాధ, రేడియాలజిస్టుల సంఘం ప్రతినిధి గురుప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆదిత్యకుమార్, రవికుమార్, ఏడీఎంహెచ్‌వో మీనాక్షి, దిశ డీఎస్పీ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







